Trending Now
Tuesday, March 10, 2026

Buy now

Trending Now

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

గీసుగొండ, అక్షర సవాల్:

వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని 15వ డివిజన్ మొగిలిచెర్ల ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులకు పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. బర్న్ ఫర్న్ నీడ్ ఫౌండేషన్‌కు చెందిన గ్రామస్తుడు బొట్టు వినయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత, నేతాజీ సర్వీస్ టీమ్ సభ్యుడు బరుపటి అనిల్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా బొట్టు వినయ్ మాట్లాడుతూ, రాబోయే పదవ తరగతి పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారంగా రాగి జావా, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు, డిజిటల్ తరగతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు వంటి అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించి ప్రభుత్వ బడులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతాజీ సర్వీస్ టీమ్ సభ్యులు మండ సాయి, కిరణ్, భార్గవ్, పవన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles