Trending Now
Tuesday, March 10, 2026

Buy now

Trending Now

దళిత హామీల అమలు కోరుతూ కలెక్టరేట్ వద్ద ఎమ్మార్పీఎస్ నిరసన

దళిత హామీల అమలు కోరుతూ కలెక్టరేట్ వద్ద ఎమ్మార్పీఎస్ నిరసన

 

వరంగల్, అక్షర సవాల్:

దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దళితరత్న కేదాసి మోహన్, ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి బాబు మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నమిండ్ల క్లెమెంట్ మాదిగ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్‌లో దళితులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు మూడు ఎకరాల సాగుభూమిని కేటాయించాలని కోరారు. అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చి వాటిని అమ్ముకునే హక్కులు కల్పించాలని తెలిపారు. అలాగే కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్ల నిధులను కేటాయించి దళితుల అభివృద్ధికి వినియోగించాలని, తోళ్ల పరిశ్రమ శాఖకు రూ.10 వేల కోట్లు కేటాయించి లీడక్యాప్ భూములను పరిరక్షించేందుకు చైర్మన్‌ను నియమించాలని అన్నారు. మాదిగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా యువసేన అధ్యక్షుడు కేదాసి ప్రేమ్‌సాగర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొంగర మహాలక్ష్మి, నర్సంపేట ఇంచార్జ్ ఆకుల పెళ్లి ఉప్పలయ్య, జిల్లా నాయకులు బాబు, విలీన గ్రామాల అధ్యక్షుడు ల్యాదల్ల చిన్ని, గీసుగొండ మండల అధ్యక్షుడు బరిగెల యాకోబు, అధికార ప్రతినిధి నల్ల బాబురావు, సీనియర్ నాయకురాలు గాలి యాకమ్మతో పాటు జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles