[pj-news-ticker]
Thursday, April 23, 2026

Buy now

నర్సంపేట డిపోలో ఉద్రిక్తత

నర్సంపేట డిపోలో ఉద్రిక్తత

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

గాయాలతో ఎంజీఎంకు తరలింపు

నర్సంపేట, ఏప్రిల్ 23, అక్షర సవాల్: వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుల నిరసన కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సమ్మె నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు డిపో గేటు ముందు నిరసన వ్యక్తం చేస్తుండగా, డ్రైవర్ శంకర్ గౌడ్ తీవ్ర ఆవేదనకు లోనై తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరగగా, అప్రమత్తమైన తోటి కార్మికులు, పోలీసులు వెంటనే స్పందించి మంటలను ఆర్పి అతన్ని రక్షించారు. గాయపడిన డ్రైవర్‌ను తొలుత నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎంజీఎం)కు తరలించినట్లు సమాచారం.ఈ ఘటనతో డిపో పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కార్మికుల సమస్యలపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలిసింది. నిరసనల సమయంలో శాంతియుత మార్గాలను అనుసరించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన స్పష్టంచేస్తోంది.

Related Articles

Latest Articles