[pj-news-ticker]
Saturday, June 6, 2026

Buy now

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం

 

గొర్రెకుంటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఆక్రమణదారులపై క్రిమినల్ కేసుల హెచ్చరిక

గీసుగొండ, జూన్ 06 అక్షర సవాల్:  ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని గాంధీనగర్ పరిధిలో ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను శనివారం రెవెన్యూ శాఖ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు శాఖల సంయుక్త బృందం కూల్చివేసింది. అధికారుల వివరాల ప్రకారం, గ్రామంలోని సర్వే నంబర్ 107లో గల విలువైన ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక చర్యలకు దిగిన అధికారులు భారీ యంత్రాలతో అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గీసుగొండ తహసీల్దార్ మాట్లాడుతూ, ప్రజా ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రభుత్వ భూములపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా వాటిని వెంటనే తొలగించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల రక్షణ కోసం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఈ కూల్చివేత కార్యక్రమంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొని చర్యలను పర్యవేక్షించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తూ అధికారులు చేపట్టిన ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Latest Articles