[pj-news-ticker]
Monday, June 8, 2026

Buy now

మృగశిర రోజున మత్స్యకారుడికి భారీ వరం 

మృగశిర రోజున మత్స్యకారుడికి భారీ వరం 

ఊకల్ హవేలీ చెరువులో వలలో చిక్కిన భారీ రవ్వు చేప

చూసేందుకు తరలివచ్చిన గ్రామస్తులు

గీసుకొండ, అక్షర సవాల్: మృగశిర నక్షత్రం రోజున గీసుకొండ మండలంలోని ఊకల్ హవేలీ చెరువులో మత్స్యకారుడు కొత్తగట్టు కోటేశ్వర్‌కు అదృష్టం కలిసివచ్చింది. చేపల వేటకు వెళ్లిన ఆయన వలలో భారీ పరిమాణం గల రవ్వు చేప చిక్కడంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. శనివారం ఉదయం చెరువులో వల వేసిన కోటేశ్వర్‌కు కొద్దిసేపటికే భారీ చేప చిక్కింది. చేప బరువు ఎక్కువగా ఉండటంతో దానిని ఒడ్డుకు చేర్చేందుకు పలువురు మత్స్యకారులు కలిసి శ్రమించారు. అరుదైన పరిమాణంలో ఉన్న చేపను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. ఊకల్ హవేలీ చెరువులో చేపల పెంపకం అనుకూలంగా సాగుతుండటంతో ఇలాంటి భారీ చేపలు పెరుగుతున్నాయని మత్స్యకారులు తెలిపారు. చేప విక్రయం ద్వారా కోటేశ్వర్‌కు గణనీయమైన ఆదాయం లభించే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. మృగశిర నక్షత్రం రోజున భారీ రవ్వు చేప వలలో చిక్కడం విశేషంగా మారగా, ఈ ఘటన ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.

Related Articles

Latest Articles