మొదటి రోజు పరీక్ష రాసి బయటికి వస్తున్న విద్యార్థులు
పది పరీక్షలకు100 శాతం హాజరు
ప్రశాంతంగా ముగిసిన మొదటి రోజు పరీక్షలు
మంగపేట విద్యాశాఖ అధికారి పొదేం మేనక
మంగపేట,మార్చి 14, అక్షర సవాల్:
మండల కేంద్రంలోని కమలాపురం, మంగపేట, రాజుపేట ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమైన నేపథ్యంలో మొదటిరోజు తెలుగు పరీక్షకు 100 శాతం విద్యార్థులు హాజరైనట్లు మంగపేట విద్యాశాఖ అధికారి పొదేం మేనక పత్రికా ప్రకటనలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మంగపేట కేంద్రంలో 133 కమలాపురం కేంద్రంలో 150 రాజుపేట కేంద్రంలో 95 మంది విద్యార్థులు హాజరయ్యారని మొత్తం 378 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎవరు గైర్హాజరు కాలేదని మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని అన్నారు.
పరీక్ష కేంద్రం నుండి బయటకు వస్తున్న విద్యార్థులు

