నల్లబెల్లి నూతన ఎస్ఐ గా ప్రసన్నకుమార్
నల్లబెల్లి, అక్షర సవాల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన బదిలీలో ఎస్ఐ గోవర్ధన్ బదిలీపై వెళ్ళటం ద్వారా ఖాళీ అయిన నల్లబెల్లి పోలీస్ స్టేషన్ కి ఎం సాయి ప్రసన్న కుమార్ సబ్ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. నల్లబెల్లికి రావడం చాలా సంతోషంగా ఉందని మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ తన దేహంగా పని చేస్తానని అన్నారు.
మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో మండలంలో శాంతియుత వాతావరణాన్ని కల్పించడానికి నా వంతు బాధ్యతగా వ్యవహరిస్తానని దీనికి అందరి సహకారం అవసరమని అన్నారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ సాయి ప్రసన్నకుమార్ ను మండలంలోని ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు

