పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఘనంగా గురువులకు సన్మానం
జ్ఞాపకాలలో మునిగిన పూర్వ విద్యార్థులు
నెక్కొండ,అక్షర సవాల్: నెక్కొండలోని వాసవి కళ్యాణ మండపంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2005–2006 విద్యాసంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానించి, సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆటలు,పాటలతో ఉత్సాహంగా గడిపారు. గురువులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించగా,గురువులు కూడా విద్యార్థులను అభినందిస్తూ వారి విజయాలను కొనియాడారు. సుమారు 120 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

