[pj-news-ticker]
Saturday, June 13, 2026

Buy now

ముగిసిన వేసవి సెలవులు 

ముగిసిన వేసవి సెలవులు 

పాఠశాలలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి

విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి

ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభం

మండల విద్యాధికారిని పొదేం మేనక

మంగపేట, జూన్ 13, అక్షర సవాల్:

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జూన్ 14 తో వేసవి సెలవులు ముగిసాయి. దీనితో పాఠశాలలు సోమవారం జూన్ 15 నుంచి పునఃప్రారంభం కానున్నాయని మండల విద్యాధికారిని పొదేం మేనక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యాధికారిని మాట్లాడుతూ విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించాలని విద్యార్థులు తగిన సామగ్రి (పుస్తకాలు) తో నిర్ణీత సమయానికి పాఠశాలకు హాజరు కావాలని అన్నారు.

పాఠశాలలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి:

పాఠశాలలో అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయబడ్డాయని విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ  సమగ్ర అభివృద్ధికి పాఠశాలల ఉపాధ్యాయుల బృందం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి:

విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను సమయానికి పాఠశాలకు పంపించి ఉపాధ్యాయులకు సహకరించాలి.

ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభం:

మండలంలోని రాజపేట ఎంపీపీఎస్, కొత్త బెస్తగూడెం ఎంపీయూపీఎస్, మల్లూరు జడ్పీహెచ్ఎస్, కమలాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో నూతనంగా ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కాను ఉన్నాయని మండల విద్యాధికారిని మేనక తెలిపారు.

Related Articles

Latest Articles