ప్రకృతి అందాలు చూడతరమా…!
మేడారం/మంగపేట, జనవరి 31, అక్షర సవాల్:
ప్రకృతి అందాలను కళ్ళతోచూడటం చెవులతో వినడం మనసుతో నవ్వడం ఈ మూడు మన మనసుకు ప్రశాంతిని ఇస్తుంది. అసలు ప్రకృతి అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాం. ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న చెట్లు, పువ్వులు, మొక్కలు, జంతువులు, ఆకాశంలోని సూర్య-చంద్రులు, ఎత్తైన కొండలు , దట్టమైన అడవులు, జలజల పారే జలపాతాలు ఉప్పొంగే సముద్రాలు నదులు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ప్రకృతి అందాలు మనం చూసే ప్రతిదానిలో ప్రకృతి అందం రూపొందించబడింది మనిషి జీవించడానికి ప్రకృతిపై ఎప్పుడు ఆధారపడుతూనే ఉంటాం ఆ ప్రకృతి మనకు ఆక్సిజన్ రూపంలో శ్వాస తీసుకొని మనం బ్రతకడానికి దోహదపడుతుంది. భూమిని అందంగా తీర్చిదిద్దే అనేక రంగులను ప్రకృతిలో చూస్తూ ఉంటాం మన చుట్టూ ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం.




