అసెంబ్లీ వేదికగా కీలక గణాంకాలు వెల్లడించిన మంత్రి సీతక్క
హైదరాబాద్ అక్షర సవాల్:
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం పనిచేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సాధికారతపై కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మేడారం జాతర సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం రూ. 6 కోట్లతో 565 మంది మహిళలకు దుకాణాలను ఏర్పాటు చేయించిందని ఆమె తెలిపారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఈ మహిళలు రూ. 3.33 కోట్ల అదనపు ఆదాయాన్ని గడించడం గమనార్హం. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మహిళా పొదుపు సంఘాల బలోపేతానికి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.


