[pj-news-ticker]
Friday, May 1, 2026

Buy now

కేయూ విద్యార్థిని శ్రీవిద్య మృతి

కేయూ విద్యార్థిని శ్రీవిద్య మృతి

కేసులో సంచలన విషయాలు

సీనియర్ల వేధింపులే కారణమా?

వరంగల్, అక్షర సవాల్:

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్న పీజీ విద్యార్థిని శ్రీవిద్య మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామానికి చెందిన ఆమె, మరణానికి ముందు ఆస్పత్రిలో రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. హోస్టల్‌లో సీనియర్ విద్యార్థులు తనను ర్యాగింగ్ పేరుతో తీవ్రంగా వేధించారని, ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోయానని ఆమె తన ఆఖరి వీడియోలో ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనపై జరిగిన అన్యాయం, వేధింపుల గురించి ఆమె కన్నీరుమున్నీరవుతూ వివరించిన తీరు అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీవిద్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Latest Articles