నెక్కొండలో గుడుంబా గుట్టు రట్టు…
2000 లీటర్ల పానకం స్వాధీనం
ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
నెక్కొండ, అక్షర సవాల్: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం హరిచంద్ తండాలో నాటు సారా తయారీ,విక్రయాలు బహిరంగంగా జరుగుతున్న నేపథ్యంలో ఎక్సైజ్,స్థానిక పోలీసుల సంయుక్త బృందం బుధవారం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీ మొత్తంలో గుడుంబా పానకం,నాటు సారా,ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి,నెక్కొండ సీఐ శ్రీనివాస్,ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో సుమారు 2000 లీటర్ల గుడుంబా పానకం,20 లీటర్ల నాటు సారా,50 కిలోల బెల్లం,10 కిలోల పట్టికను అధికారులు పట్టుకున్నారు.ఈ కేసులో రాజావత్ రాము,జాటోతు కిట్టయ్య,జాటోతు బిక్షపతి అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.స్వాధీనం చేసుకున్న సామగ్రిని నర్సంపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.ప్రజల ఆరోగ్యాన్ని హానిచేసే నాటు సారా తయారీ విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని,ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరారు.

