[pj-news-ticker]
Friday, May 8, 2026

Buy now

ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు.. 

ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు.. 

రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్

ములుగు ప్రతినిధి/మంగపేట,మార్చి23,అక్షర సవాల్:

ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తులు కోర్టులో బాంబు అమర్చినట్లు ఈమెయిల్ ద్వారా సందేశం పంపారు. ఈమెయిల్ రాగానే కోర్టు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే కోర్టు ప్రాంగణానికి చేరుకుని, భవనంలో ఉన్న జడ్జిలు, అడ్వకేట్లు, ఉద్యోగులు మరియు కక్షిదారులను సురక్షితంగా బయటకు పంపించారు. ప్రస్తుతం బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి కోర్టు ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది.

Related Articles

Latest Articles