ఘనంగా మేడిపల్లి భవాని సత్తియాడి జాతర
నర్సంపేట, అక్షర సవాల్ :
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని మేడిపల్లి గ్రామంలో బంజారా సమాజ కులదేవతలైన సత్తి యాడి భవాని జాతర ఘనంగా జరుగుతుంది. ఈ వేడుక లో మాజీ ఎంపీ సీతారం నాయక్ పాల్గొని జాతర లో అమ్మ వారి దర్శనం నా అదృష్టంగా భావిస్తు న్నాను, ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ పవిత్ర సందర్భంలో భారతదేశం అనేక కులాలు, తెగలు, మతాల సమాహారం. ప్రతి వర్గం తమ తమ కులదే వతలు, ఇంటిదేవత లను ఎన్నుకొని పూజించడం ద్వారా సకల కష్టనష్టాల నుండి కుటుంబ రక్షణ, ఐక్యత, శాంతిని ప్రసాదిస్తార నే విశ్వాసం సమాజంలో గాఢంగా ఉంది మరియు తమ ఆచార సంప్ర దాయాలను, ఆధ్యా త్మిక విశ్వాసాలను తరతరాలకు పరిరక్షించుకుంటూ కొనసాగుతుంది. దేవుడు ఒక్కడే అయి నా, భిన్న నా మరూపాలతో, భిన్న భాషల్లో ఏ పేరుతో నపూజించ బడిన, నదులన్నీ సాగరంలో కలిసినట్టు ఒకే పరమా త్మను చేరుతుంది.
సింధు నాగరికత కాలం నుంచే ప్రకృతి ఆరాధకులుగా వెలుగొందిన ఆదిమ బంజారాలు, తల్లిదండ్రులను దేవతలుగా భావించి పూజించిన అనంతరం, సప్త భవానీలైన — మేరామా, తోళ్జా, మంత్రాళ్, ద్వాళంగర్, హింగ్లా, శీత్లా — దేవతలను తమ కులదేవతలుగా స్వీక రించారు. దేశ విదేశాలలో వివిధ పేర్లతో పిలవబడు తున్న బంజారాలో గోత్రానుసారం కుటుంబాలు ఒకరిని తమ ఇంటి దేవతగా పూజిస్తూ, ఆర్థిక స్థితిని బట్టి సంవ త్సరానికి ఒకసారి లేదా వివాహాల ముందు భవానికి మేక పోతను బలి ఇచ్చి, రాత్రంతా “ఝామ్రా” పేరుతో భజన నిర్వహించడం మన ప్రత్యేకత. అలాగే మన ఆధ్యాత్మిక గురువులైన హాథిరాం బావాజీ, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వంటి శాఖాహార మహనీ యులను భోగ్ బండారాలతో గౌరవించడం మన సంప్ర దాయం.బ్రహ్మానికి ప్రత్యేక పూజావిధానం లేకుండా ఇంటి యజ మానియే పూజారిగా వ్యవహరించడం మన సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని ప్రాంతాల్లో మన పూర్వీకుల నుండి వేల సంవత్సరాలు గా వస్తున్న సంప్రదాయాలకు దూరంగా, కొత్త పద్ధతుల పేరుతో అధిక ఆర్థిక భారాన్ని మోస్తూ, యాటలు, మద్యపానం వంటి వాటిపై అధిక వ్యయం జరుగు తుందనే విషయం ఆందోళన కలిగిస్తుంది.ఆధునికతను స్వీకరించడం తప్పు కాదు, కానీ మన మూలాలు, మన సంస్కృతి, మన సంప్రదాయాలను మరవడం మాత్రం సరికాదు. అందువల్ల మనందరం — ముఖ్యంగా యువత — మన బంజారా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, సంస్కృతి సంప్రదాయాలను సంరక్షిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మేడి పల్లి లో స్వయంభువు గా వెలసిన సత్తి యాడి భవాని ప్రదేశం, అనేక సంవత్సరాలుగా చరిత్ర కలిగి ఉన్న ,ఈనాటికి ఆ దేవాలయం అభివృద్ధికి నోచుకోలేదు. బంజారా భక్తులు అనేక అష్ట కష్టాలను అధిగమిస్తూ, అప్రాంతంకి చేరుకొని జాతర రోజున తమ మొక్కులు చెల్లించుకుంటు న్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తగు చర్యలు తీసుకోనీ మౌలిక సదుపాయాలు కల్పించాలని బంజారా సమాజం కోరుతున్నది.
యువతి యువకులకు ఇచ్చే సందేశం
మన బంజారా సమాజం ముఖ్యంగా యువతీ యువకులు ఉంచుతున్నాను. అంబేద్కర్ పేర్కొన్న విధంగా మన చరిత్రను, సంస్కృతి సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ పిలుపు నిచ్చారు.

