Trending Now
Thursday, March 26, 2026

Buy now

Trending Now

వరంగల్ ఎంజీఎంలో దారుణం..

వరంగల్ ఎంజీఎంలో దారుణం..

ఆటోలా మారుతున్న అంబులెన్స్‌లు

రోగులకు నరకయాతన

వరంగల్ అక్షర సవాల్: వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో వైద్య సేవల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. సరైన సౌకర్యాలు లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డయాలసిస్ మరియు 2D ఎకో వంటి కీలక సేవలు అందుబాటులో లేకపోవడంతో, రోగులను ప్రతిరోజూ కేఎంసీ (KMC) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాల్సి వస్తోంది. ఆసుపత్రి మొత్తానికి ఒకే అంబులెన్స్ అందుబాటులో ఉండటంతో, అందులోనే ప్రైవేటు ఆటోలు, జీపుల్లో మాదిరిగా రోగులందరినీ కుక్కి తరలిస్తున్నారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఇలా గొర్రెల మందలా తరలించడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం స్పందించి అంబులెన్స్‌ల సంఖ్యను పెంచాలని వారు కోరుతున్నారు

Related Articles

Latest Articles