[pj-news-ticker]
Friday, May 8, 2026

Buy now

అదనపు కట్నం కోసం వేధింపులు

అదనపు కట్నం కోసం వేధింపులు

భర్త, అత్తపై ఆరోపణలు

కూతురుతో ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళ

ప్రాణహాని ఉందంటున్న బాధితురాలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

చెన్నరావుపేట, అక్షర సవాల్: వరంగల్ జిల్లా నెక్కొండ మండల పరిధిలో అదనపు కట్నం కోసం వేధింపులు భరించలేక ఓ మహిళ తన చిన్నారితో కలిసి ఇంటి నుంచి బయటపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు భూక్యా అఖిల (21) భర్త కృష్ణమోహన్,అత్త తారమ్మపై తీవ్ర ఆరోపణలు చేసింది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం,చెన్నరావుపేట మండలం తోపనగడ్డ తండాకు చెందిన మాలోత్ రాములు–వనిత దంపతుల కుమార్తె అఖిలను,నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన భూక్యా హీరామాన్–తారమ్మల కుమారుడు కృష్ణమోహన్‌కు రెండేళ్ల క్రితం వివాహం చేశారు. వివాహం జరిగినప్పటి నుంచి భర్తతో పాటు అత్త అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ,తరచూ శారీరకంగా,మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. నాలుగు నెలల శిశువు ఉన్నప్పటికీ వేధింపులు ఆగలేదని తెలిపింది. ఇటీవల తనను కొట్టడం,తిట్టడం,చంపేస్తామని బెదిరించడంతో ప్రాణభయంతో చిన్నారిని తీసుకుని మొక్కజొన్న చేనులో నుంచి తప్పించుకుని కట్టుబట్టలతోనే పుట్టింటికి చేరుకున్నట్లు వివరించింది.ప్రస్తుతం తండ్రి మాలోత్ రాములు,తల్లి వనిత వద్ద ఆశ్రయం పొందుతోంది. అదేవిధంగా,భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను నిరంతరం వేధిస్తున్నాడని కూడా ఆమె ఆరోపించింది.పది రోజులుగా పుట్టింట్లో ఉంటున్న సమయంలో,గత మంగళవారం అర్థరాత్రి సమయంలో వివాహ సమయంలో ఇచ్చిన సామగ్రిని ట్రాక్టర్‌లో తీసుకువచ్చి తన తండ్రి ఇంటి ముందు రోడ్డుపై చెల్లాచెదురుగా పడేసి వెళ్లిపోయినట్లు పేర్కొంది.ఈ ఘటనపై బాధితురాలు చెన్నరావుపేట పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Latest Articles