Trending Now
Wednesday, February 11, 2026

Buy now

Trending Now

బంజారా సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలి

బంజారా సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలి

– తెలంగాణ గొర్ సిక్వాడి రాష్ట్ర అధ్యక్షులు బానోతు వెంకన్న నాయక్..

– గోర్ సేన, గోర్ సిక్వాడి ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు ఘన సన్మానం..

 

వరంగల్, ఫిబ్రవరి 8 అక్షర సవాల్:

ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచ్ లు బంజారా జాతి సంస్కృతి సంప్రదాయాలను కాపాడి జాతి చరిత్రను ప్రపంచానికి చాటేలా ఉండాలని గోర్ సిక్వాడి రాష్ట్ర అధ్యక్షులు బానోతు వెంకన్న నాయక్ అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో.. ఇటీవల వరంగల్ జిల్లాలో ఎన్నిక కాబడిన సర్పంచ్ లు 121 మందిని ఉపసర్పంచ్, కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోర్ బంజారా కు చెందిన సర్పంచ్ ఉప సర్పంచ్లు బంజారా జాతిని మన సంస్కృతి సంప్రదాయాలను.. ప్రపంచానికి చాటిని చెప్పాలా కృషి చేయాలి అన్నారు. ఐదేళ్లపాటు.. సర్పంచ్ లే గ్రామ మొదటి పౌరులని.. అధికారుల సహాయంతో.. తండాలను గుడాలను అభివృద్ధి చేసుకోవాలని, సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా తండాలలో.. సేవాలాల్ మహారాజ్ జయంతి, శీతల పండుగ తీజ్ పండుగలను ఘనంగా నిర్వహించాలని.. సెలవు తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హాసాభి హాట్య నాయక్, రాయిసిన అధ్యక్షులు మల్సూర్ నాయక్, విచారి దళ్ అధ్యక్షులు పరశురాం, మీడియా వింగ్ అధ్యక్షులు బాదావత్ బాలాజీ నాయక్, గోర్ సిక్వాడి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ నుండి రాము నాయక్, రాగ్య నాయక్, వాలియా నాయక్ మహేశ్వర రాథోడ్, గోర్ సేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు నాయక్, వరంగల్ జిల్లా అధ్యక్షులు మహేందర్ నాయక్, రామ్ దాన్ నాయక్,మాలోతు నాను నాయక్, బానోతు వెంకన్న నాయక్ కార్యదర్శులు యాకుబ్ నాయక్,సాయిరాం, ధర్మాణి బాయి కమిటీ, రాణి బాయి, సోనాబాయి, స్వర్ణభాయి సర్పంచులు ఉప సర్పంచ్లు కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles