జాతీయ రహదారిపై రోడ్డు మరమ్మత్తులు
వాహనదారులకు తగు సూచనలు
దామెర ఎస్సై కొంక అశోక్
వరంగల్ అక్షర సవాల్:
దామెర మండల పరిధిలోని ఊరుగొండ ఎన్ ఎస్ ఆర్ హోటల్ మధ్య నేటి నుండి వారం రోజుల పాటు రోడ్డు మరమ్మతులు.
జాతీయ రహదారిపై రోడ్డు పనుల నేపథ్యంలో నేటి నుండి వారం పాటు వన్-వే (One Way) అమలు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఓవర్ టేకింగ్‌లు చేయొద్దని దామెర ఎస్సై కొంక అశోక్ విజ్ఞప్తి.
నేటి నుండి వారం రోజుల పాటు జాతీయ రహదారిపై నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచనలు ఇచ్చారు.
పోలీసుల సూచన:
ఊరుగొండ మార్గంలో ప్రయాణించే వారు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరిన దామెర ఎస్సై.


