Trending Now
Sunday, March 29, 2026

Buy now

Trending Now

బూత్ స్థాయిలో బీజేపీ బలోపేతానికి దిశా నిర్దేశం

 

బూత్ స్థాయిలో బీజేపీ బలోపేతానికి దిశా నిర్దేశం

ప్రశిక్షణ మహాభియాన్‌తో కార్యకర్తల్లో నూతనోత్సాహం

గీసుగొండ, మార్చి 29: అక్షర సవాల్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్వహిస్తున్న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 రెండవ రోజు శిక్షణ శిబిరం ఆదివారం ధర్మారం లోని వరంగల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో విజయవంతంగా ముగిసింది. గీసుకొండ, సంగెం మండలాలు, 15, 16, 17వ డివిజన్లకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి కార్యకర్తలకు సమగ్ర మార్గనిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, కార్యాచరణపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు. సమరోప కార్యక్రమంలో మాట్లాడుతూ, బూత్ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ సేవాభావంతో పనిచేస్తే పార్టీ మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రెండు రోజుల శిక్షణ శిబిరం ద్వారా కార్యకర్తలకు సిద్ధాంతపరమైన, సంస్థాగత పరమైన అవగాహన పెంపొందించబడిందని తెలిపారు. కార్యక్రమం మొత్తం క్రమబద్ధంగా సాగి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల కన్వీనర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి కంది క్రాంతికుమార్, రంగంపేట సర్పంచ్ బెజ్జంకి శేషాద్రి, జిల్లా ఉపాధ్యక్షులు కూతురు రాజు, రాధారపు శివకుమార్, ములక ప్రసాద్, మొలుగూరి శ్రీనివాస్, సంగెం మండలం అధ్యక్షుడు చంద్రమౌళి, గీసుకొండ మండలం అధ్యక్షుడు కొంగర రవి కుమార్, 15వ, 16వ, 17వ డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్, ప్రసన్న రాంప్రసాద్, విజయ్, గోదాసి అశ్విన్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శిక్షణ శిబిరం ద్వారా కార్యకర్తల్లో స్పూర్తి, పార్టీ విస్తరణకు బాటలు

Related Articles

Latest Articles