[pj-news-ticker]
Thursday, May 14, 2026

Buy now

రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

నేరాలకు దూరంగా ఉండాలి

సీఐ మహేందర్ హెచ్చరిక

హన్మకొండ క్రైమ్, అక్షర సవాల్ : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ మహేందర్ మాట్లాడుతూ, రౌడీ షీటర్లు చట్ట విరుద్ధ కార్యకలాపాలు, భూ కబ్జాలకు దూరంగా ఉండాలని, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడవద్దని కఠినంగా హెచ్చరించారు.

భవిష్యత్తులో ఎలాంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. యువత చెడు మార్గాలను విడిచిపెట్టి ఉపాధి, కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టాలని తెలిపారు.

నేరాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

 

 

 

 

 

Related Articles

Latest Articles