[pj-news-ticker]
Monday, July 6, 2026

Buy now

నరసింహస్వామి బాలరాజు సేవలు మరువలేనివి

నరసింహస్వామి బాలరాజు సేవలు మరువలేనివి

జిల్లా గిరిజన శాఖ డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు దేశీ రామ్ నాయక్

హన్మకొండ, అక్షర సవాల్ :మహబూబాబాద్ జిల్లాలో సుదీర్ఘకాలం జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా సేవలందించిన మాడిశెట్టి నరసింహస్వామి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాపెల్లి బాలరాజు ఇటీవల పదవీ విరమణ పొందారు.వారి సేవలకు గుర్తుగా ఆదివారం హనుమకొండలోని వారి గృహంలో జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన శాఖ డిప్యూటీ డైరెక్టర్ [డిటిడబ్ల్యుఓ] గుగులోతు దేశీ రామ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఇరువురిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దేశీ రామ్ నాయక్ మాట్లాడుతూ, “ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో బదిలీలు, పదవీ విరమణలు సహజం. ఉద్యోగులు పనిచేసిన ప్రతి చోటా అంకితభావంతో పనిచేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు.బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ శాఖల పరిధిలో క్షేత్రస్థాయిలో పేద విద్యార్థులకు విద్యను అందించడంలో నరసింహస్వామి, బాలరాజు పోషించిన పాత్ర అభినందనీయమని కొనియాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహించిన సమయంలో వీరిద్దరూ పలుమార్లు రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, అభినందనలు అందుకున్నారు. వారి సేవలు మరువలేనివని దేశీ రామ్ నాయక్ తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో డిఆర్డిఓ అధికారి సభావట్ కృష్ణవేణి, మెప్మా ప్రాజెక్ట్ డిపిఎం విజయ, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, టెక్నికల్ అధికారి మదన్ సింగ్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Latest Articles