మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.30 కోట్లు ఇవ్వండి … మంత్రి కేటీఆర్ కు దాసరి వినతి
పెద్దపల్లి జిల్లా :జూన్ 28 (అక్షర సవాల్ ):
పెద్దపల్లి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.30 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విన్నవించారు. బుధవారం హైదరాబాదులో మంత్రి కేటీఆర్ కలిసి పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం 25 కోట్ల రూపాయలు, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం 5 కోట్ల రూపాయలు మొత్తం 30 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.