Trending Now
Friday, March 21, 2025

Buy now

Trending Now

నకిలీ డాక్టర్ గుట్టురట్టు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

నకిలీ డాక్టర్ గుట్టురట్టు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..

హైదరాబాద్ , జూలై 15 (అక్షర సవాల్) :

నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్గా చలామణి అవుతున్న ఓ వ్యక్తితో పాటు అతనికి సర్టిఫికెట్ను సమకూర్చిన మరో వ్యక్తిని సౌత్ ఈస్ట్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫలక్నుమా ప్రాంతానికి చెందిన ఖాజా ముజామిలుద్దీన్ (29) ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. అనంతరం మాసబ్ ట్యాంక్ లోని ఓ దంత వైద్యశాలలో పనిచేశాడు.దీనిని ఆసరాగా చేసుకుని తన స్నేహితుడు సయ్యద్ అబ్దుల్ అస్లాం ద్వారా కర్నాటక నుంచి నకిలీ బీడీఎస్ డాక్టర్ సర్టిఫికేట్ పొందాడు. ఇలా 2020 నుంచి ఫలక్నుమాలో ఆక్సీజన్ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు.

దీని పై విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్, శాలిబండ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వైద్య సామాగ్రి, నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Latest Articles