Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

రుణ లక్ష్యసాధనకు సమన్వయం అవసరం

రుణ లక్ష్యసాధనకు సమన్వయం అవసరం

బ్యాంకర్ల సమావేశం లో సూచించిన జాయింట్ కలెక్టర్ స్వర్ణలత

భుపాలపల్లి , జూన్ 28(అక్షర సవాల్ ):

రుణ లక్ష్యసాధనకు సమన్వయం అవసరమని జయశంకర్ భుపాలపల్లి జిల్లా  జాయింట్ కలెక్టర్ కె.స్వర్ణలత అన్నారు. ప్రగతి భవన్ కార్యాలయంలో బుధవారం  బ్యాంకర్ల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రుణ లక్ష్య సాధనలో మరింత ప్రగతి సాధించేందుకు బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. జిల్లాలో పంట రుణాలు, ఎం.ఎస్.ఎం.ఇ, హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ క్షుణ్ణముగా సమీక్షించారు మరియు బ్యాంకుల వారిగా వివిధ బ్యాంకు అధికారులతో వ్యవసాయ రుణాలను క్షుణ్ణముగా సమీక్షించారు ప్రభుత్వ పథకాలు అమలులో లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా రుణాలు అందించాలని అన్నారు.
ఆయా బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న యూనిట్లను బ్యాంకు అధికారులతో తరుచూ సంప్రదించి రుణ ప్రక్రియ పూర్తి చేయాలి అన్నారు. రికవరీ శాతాన్ని పెంచేందుకు అధికారులు గ్రామ స్థాయిలో లబ్దిదారులకు అవగాహనా పరిచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.జిల్లాలో రైతు వేదికలు ఉన్నాయని ప్రతినెల సమావేశాలు చేపట్టి రుణ ప్రగతి పెంచేందుకు మండల స్థాయి అధికారులకు కృషి చేయాలి అన్నారు.అత్యధికంగా పంట రుణాలు ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పాడి పరిశ్రమకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అదే విధంగా కోళ్ల ఫారాలు నెలకొల్పుకనెందుకు పుకునేందుకు సెరికల్చర్ చేపట్టేందుకు అధిక మొత్తంలో రుణాలు ఇచ్చే విధంగా కృషి చేయాలి అన్నారు .పట్టణ ప్రాంతములో వీది వ్యాపారుల రుణాలు సకాలములో ఇవ్వాలన్నారు ఇదేవిధంగా రుణ లక్ష్యాలను పెంచుతూ ఇదే దిశగా రుణాలను పెంచుతూ అత్యధిక మంది నిరుపేదలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు సహకరించాలన్నారు .విద్యారుణాలు కూడా అదే అధిక మొత్తంలో ఇవ్వాలని విద్యాభివృద్ధి కృషి చేయాలన్నారు రికవరీ శాతం పెంచినపుడే బ్యాంకు లో రుణాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తాయని అధికారులు ఆ దిశగా కృషి చేయాలన్నారు. రుణాలు పొందే వారికి కూడా రుణాల వినియోగంలో లబ్ధిదారులకు అధికారులు వెన్నంటి ఉండి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.బి.ఐ. ఎల్.డి.ఓ అలీ బాబా, నాబార్డ్ ఏ.జి.ఎం., రవి, డి.ఆర్.డి.ఏ., డి.పురుషోత్తం., జిల్లా అధికారులు, ఎల్.డి.ఎం. ఎ.తిరుపతి,  బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles