మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది*
సీఎం కేసీఆర్ గారు మహిళల పక్షపాతి
*కుట్టు మిషన్ల శిక్షణ తీసుకున్న వాళ్లకు టెక్స్టైల్ పార్కు లో ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం*
*దేవరుప్పుల మండలం సింగరాజు పల్లిలో రెండవ విడత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి*
జనగామ,జూన్ 24 ( అక్షర సవాల్):
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన రెండవ విడత కుట్టు మిషన్ల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మహిళల పక్షపాతి సీఎం కేసీఆర్ అన్నారు.మహిళల సంక్షేమం కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టింది ఒక తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెండ్లికి భరోసా కల్పిస్తున్నారు.పాలకుర్తి నియోజకవర్గం లో మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసమే ఈ కుట్టు మిషన్ల శిక్షణను ఏర్పాటు చేశాను అన్నారు.
రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఈ కుట్టు మిషన్ల శిక్షణ ను సీఎం కెసిఆర్ ని ఒప్పించి పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నానన్నారు.త్వరలో అన్ని నియోజకవర్గాల్లో కుట్టు మిషన్ల శిక్షణ ను ప్రారంభిస్తామన్నారు.రెండవ విడత కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ కుట్టు మిషన్ల శిక్షణ ఉపయోగపడుతుందన్నారు.మహిళలను అన్ని రంగాల్లో ముందు నిలిచేలా చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. కుట్టు మిషన్ల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మెగా టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు.
మహిళలు సీఎం కెసిఆర్ కి రుణపడి ఉండాలి. సీఎం కెసిఆర్ ని మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
——————–