Trending Now
Sunday, June 1, 2025

Buy now

Trending Now

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

 

మంగపేట, ఆగస్టు 18 (  అక్షర సవాల్  )  : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో

గౌడుల ఆరాధ్య దైవం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ  జయంతి వేడుకలను తెలంగాణ ఏజెన్సీ గౌడు హక్కుల సంఘం మంగపేట మండల అధ్యక్షుడు రావుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంగపేట మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ సెంటర్ లో తెలంగాణ ఏజెన్సీ గౌడు హక్కుల సంఘం మంగపేట మండల అధ్యక్షుడు రావుల శ్రీనివాస్ గౌడ్ సర్వాయి పాపన్న జయంతిని పురష్కరించుకుని గౌడ సంఘం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏజెన్సీ గౌడు హక్కుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బూర లక్ష్మీనారాయణ గౌడ్, జిల్లా అధ్యక్షులు కారుపోతుల నర్సయ్య గౌడ్, మంగపేట మండల అధ్యక్షుడు రావుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు  మాట్లాడుతూ రాష్ట్రంలోని గౌడులు అంతా ఏకమై సంఘటితంగా పోరాటం చేస్తే రాజకీయాలను శాసించే దిశగా ఎదగవచ్చని అన్నారు. రాష్ట్రంలో సగ భాగాన్ని పరిపాలించిన పోరాట యోధుడు పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ ఏజెన్సీ గౌడు కుల సంఘం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు రావుల సత్యం గౌడ్, లోడె శ్రీనివాస్ గౌడ్, చామకూరి వెంకటేశ్వర్లు  గౌడ్ ( భీముడు ), చీకట్ల యాకస్వామి, బండపెల్లి రవీందర్ గౌడ్ ( ఎల్ఐసి ),  కారుపోతుల యాకాంబ్రం గౌడ్, పూజారి రాజు గౌడ్, రావుల రామస్వామి, మానేపల్లి వేణు గౌడు, బండపెల్లి రవి, పూజారి రమేష్, గాజుల పవన్ కుమార్ గౌడ్, రామగాని నరేందర్, గాజుల వెంకటేశ్వర్లు, గంట చిట్టిబాబు, గాజుల ఈశ్వరయ్య  తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles