బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రజాసేవకులు భూక్య దేవ్ సింగ్
ములుగు జూన్ 28( అక్షర సవాల్ ):
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన ఇస్లావత్ బుచ్చమ్మ ఇల్లు నాలుగు రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైపోయి సర్వస్వం కోల్పోయారు. వారిని ప్రజా సేవకుడు భూక్య దేవ్ సింగ్ బుధవారం పరామర్శించి 25 కేజీల బియ్యంతో పాటుగా దుప్పట్లు అందించారు. ముద్ర బోయిన చంద్రమ్మ ఒంటరి మహిళ,వారి ఇల్లు పాక్షికంగా కాలడంతో వారికి కూడా 25 కేజీల బియ్యంతో పాటుగా దుప్పట్లను అందించారు. అదేవిధంగా మొద్దుల గూడెం గ్రామానికి చెందిన భూక్య పాపమ్మ అనారోగ్యంతో మరణించగా ఆమె దశదిన కార్యక్రమంలో భూక్య దేవ్ సింగ్ పాల్గొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అతని వెంట సామాజికవేత్త దొంతి విజేందర్ రెడ్డి,యువ నాయకులు శ్రీకాంత్, రమేష్, రాజు, గణేష్, తేజ, అరవింద్, సందీప్, వంశీ, ఆనంద్, పనిందర్, సోమ్లా , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.