Trending Now
Friday, March 21, 2025

Buy now

Trending Now

రేపటి నుంచి తెలంగాణలో డిఎస్సీ పరీక్ష

రేపటి నుంచి తెలంగాణలో డిఎస్సీ పరీక్ష

 హైదరాబాద్ జూలై 17( అక్షర సవాల్):

తెలంగాణ డిఎస్సీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ప్రారంభం కానున్నా యి. విద్యార్ధులు, నిరుద్యో గుల ఆందోళన నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై గత కొద్ది రోజులుగా గందరగోళం నెలకొంది.

టెట్‌ నిర్వహణ, డిఎస్సీ ప్రిపరేషన్ వ్యవధి సరిపో వడం లేదంటూ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది..

తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సీ పరీక్షలు గురువారం జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్‌లో పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందాయి.

ఆన్లైన్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమై ఆగస్టు 5వ తేదీ వరకు జరుగు తాయి. మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

డిఎస్సీ పరీక్షలు రోజుకు రెండు విడతల్లో నిర్వహి స్తారు. హాల్‌టిక్కెట్లలో తప్పులు పడ్డాయంటూ పెద్ద సంఖ్యలో తెలంగాణ పాఠ శాల విద్యాశాఖ కార్యాల యానికి విద్యార్ధులు వస్తుడ టంతో వాటిని సరిచేసి ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Related Articles

Latest Articles