Trending Now
Tuesday, October 29, 2024

Buy now

Trending Now

బక్రీద్ సందర్భంగా జంతువధపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బక్రీద్ సందర్భంగా జంతువధపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్:జూన్ 28( అక్షర సవాల్ ):
బక్రీద్ సందర్భంగా జంతువధపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ లేఖను సుమోటోను ధర్మాసనం పిల్‌గా స్వీకరించింది. మతపరమైన మనోభావాలు దెబ్బ తినేలా గోవధ జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. అయితే జంతువధపై చర్యలు తీసుకోవాలని బక్రీద్‌కు ఒక్క రోజు ముందు లేఖ రాయడం తగదని హైకోర్టు తెలిపింది. సున్నితమైన అంశాల్లో చివరి నిమిషంలో వచ్చి హైకోర్టును లాగితే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. గోవధ, అక్రమ రవాణా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని న్యాయస్థానానికి ఏజీ ప్రసాద్ తెలిపారు. చెక్ పోస్టులు పెట్టి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సీఎస్, డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నిజమైన స్ఫూర్తితో బక్రీద్ జరుపుకోవాలని కోరింది. ఆగస్టు 2న నివేదికలు సమర్పించాలని సీఎస్, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది

Related Articles

Latest Articles