Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

పారదర్శకంగా పోలీసు ఉద్యోగాల భర్తీ..పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ శ్రీనివాసరావు

పారదర్శకంగా పోలీసు ఉద్యోగాల భర్తీ
  • అక్రమాల పై  పక్కా సమాచారం ఇస్తే  రూ.3లక్షల పారితోషికం
  • పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ శ్రీనివాసరావు

హైదరాబాద్‌ జూలై 1(అక్షర సవాల్): రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ఎంతో పారదర్శకంగా జరుగుతోందని పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ శ్రీనివాసరావు తెలిపారు. అక్రమాలు చోటు చేసుకుంటున్నట్టు తెలిస్తే పోలీసు నియామక మండలి దృష్టికి తీసుకురావాలని సూచించారు. పక్కా సమాచారం ఇచ్చిన వారికి రూ.3లక్షల పారితోషికం ఇస్తామని ప్రకటించారు.

గత నెల 14 నుంచి 26వ తేదీ వరకు 97వేల మందికి పైగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసినట్టు వెల్లడించారు. కొందరు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

పోలీసు ఉద్యోగాల కోసం మొత్తం 12.9లక్షల దరఖాస్తులు వచ్చాయని, 3 దశల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టామన్నారు. ప్రాథమిక అర్హత పరీక్ష, దేహదారుడ్య పరీక్ష, తుది రాతపరీక్షలు నిర్వహించామని, తుది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలన పూర్తయిందని తెలిపారు. వయసు, విద్యార్హత విషయంలో నోటిఫికేషన్‌ లోనే స్పష్టంగా పేర్కొన్నాం.. కానీ, కొందరు అభ్యర్థులు వయసు, విద్యార్హత లేకున్నా దరఖాస్తు చేశారని వెల్లడించారు. అలాంటి అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించామని శ్రీనివాసరావు వెల్లడించారు.

Related Articles

Latest Articles