ఆనందం కోసం వాగులు, చెరువుల వద్దకు రావద్దు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి
భూపాలపల్లి,జూలై 29(అక్షర సవాల్):
ఆనందం కోసం నిండు కుండలా ఉన్న చెరువులు, ఉదృతంగా ప్రవహించే వాగుల వద్దకు వెళ్లద్దని, ఆనందాలు, విషాదం అయ్యే అవకాశాలు ఉన్నాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్ అన్నారు. శనివారం భారీ వర్షాలతో గండిపడ్డ, చిన్న కోడెపాక, దమ్మన్నపేట చెరువులను ఎస్పి పరిశీలించారు.అనంతరం ఘనపూర్ చెరువు చేరుకున్న ఎస్పి , మత్తడి, చెరువు కట్టపై పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ మత్తడి, ప్రవాహాల వద్దకు సందర్శకులను అనుమతించ వద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, ఏలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు ఇవ్వవద్దని అన్నారు. వరదలు, వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, మొగుల్లపల్లి ఎస్సై శ్రీధర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.