Trending Now
Monday, March 24, 2025

Buy now

Trending Now

ప్రజల చైతన్యంతోనే సైబర్ నేరాల నియంత్రణ: ఎస్పీ 

ప్రజల చైతన్యంతోనే సైబర్ నేరాల నియంత్రణ: ఎస్పీ 

భూపాలపల్లి, ఆగష్టు 11(అక్షర సవాల్):

సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, టెక్నాలజీ వాడుకుని నేరగాళ్లు ప్రజల డబ్బును దోచుకుంటున్నారని, అనవసర లింకులు క్లిక్ చేయొద్దని, ఓటిపి పాస్వర్డ్ లు ఎవరికి చెప్పద్దని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  పుల్లా కరుణాకర్  శుక్రవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్, వాట్సాప్, ఫేస్బుక్ చాటింగ్ కు దూరంగా ఉండాలని ఓటీపీ ఎవరికి చెప్పొద్దని సూచిoచారు. లాటరీలు, రివార్డులు, జాబ్స్, కమిషన్లు, డిస్కౌంట్ ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశ చూపిస్తారని, బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మొబైల్ కు వచ్చిన ఓటీపీ, ఏటీఎం పనిచేయడం లేదని, కారు  గెలుచుకున్నారని, డబ్బు రెట్టింపు అవుతుందని, మనీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్నారని ఎస్పి  పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ప్రజలు వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్, లేదా డయల్ 100 కాల్ చేసి సంబంధిత వివరాలు తెలియజేస్తే , 24 గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని ఎస్పి కరుణాకర్ గారు వివరించారు. సైబర్ నేరాలను నివారించే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజల చైతన్యమే సైబర్ నేరాల నివారణకు ఉపయోగపడుతుందని. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత వివరాలు ఇతరులతో పంచుకోకూడదని ఈ విషయంలో ప్రజలు అవగాహనతో ఉండాలని ఎస్పి  వెల్లడించారు.

Related Articles

Latest Articles