Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

జిల్లాలో వరి, పత్తి, జీలుగు విత్తనాలకు ఎలాంటి కొరత లేదు..జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

జిల్లాలో వరి, పత్తి, జీలుగు విత్తనాలకు ఎలాంటి కొరత లేదు
  • ఎవరైనా కృత్రిమంగా విత్తనాల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం 
  • రైతులు నకిలీ విత్తనాల పై అప్రమత్తంగా ఉండాలి
  • రైతు వేదికలలో నకిలీ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తాం
  • :జయశంకర్ భుపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా 

జయశంకర్ఎ భుపాలపల్లి జిల్లాలో ఎలాంటి విత్తనాల కొరత లేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జయశంకర్ భుపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో విత్తనాల కొరత, నకిలీ విత్తనాలపై పాత్రికేయల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈసారి గత సంవత్సరం కంటే పది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించనున్నాయని అందువల్ల గతం కంటే పది రోజుల ముందుగానే వర్షాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. రైతులు సాగుకు సమాయత్తం అవుతున్న దృష్యా విత్తనాలు కొరత లేదని సమృద్ధిగా ఉన్నాయన్నారు.

జిల్లాలో గత సంవత్సరం 1 లక్షా 11 వేల ఎకరాలలో వరి సాగు అయిందని, ఈ సంవత్సరం లక్ష 5 వేల ఎకరాలలో వరి, 18 వేల ఎకరాలలో మిరప, లక్ష ఎకరాలలో పత్తి పంట సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో విత్తనాలకు ఎలాంటి కొరత లేదని ఎవరైనా కావాలని కృత్రిమ విత్తనాల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పటి వరకు జిల్లాకు 43 వేల పత్తి విత్తనాల పాకెట్స్ వచ్చాయని, వాటిలో 3 వేల పాకెట్స్ విక్రయించారని, ఇంకనూ 40 వేల పాకెట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే అదనంగా 50 వేల పాకెట్స్ వస్తున్నామని అన్నారు. అలాగే వరి 35 వేల వరి విత్తనాలు సరఫరా కాగా ఇప్పటి వరకు 1300 క్విన్టాళ్లు విక్రయించారని తెలిపారు. విత్తనాలు కొరత ఉన్నట్లు రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారని, అపోహలు సృష్టిస్తున్నారని అలాంటి తప్పుడు సమాచారాన్ని రైతులు నమ్మొద్దని అన్నారు. విత్తనాలు కొనుగోలులో రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని అన్నారు. నకిలీ విత్తనాలపై అవగాహన పెంపొందించుకోవాలని దళారులను నమ్మి తక్కువ ధరకు వస్తుందని ఎటువంటి రసీదు బిల్లు లేని నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి నష్టపోవద్దని ఆయన సూచించారు. నకిలీ విత్తనాలు నియంత్రణకై ప్రభుత్వం రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, ఉద్యాన శాఖలతో టాస్క్ ఫోర్స్ కమిటీ వేసిందని తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయాలపై పటిష్టమైన నిఘా పెట్టామని అన్నారు. కొనుగోలులో రైతులకు రశీదు ఇవ్వాలని రశీదు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు బిల్లు ఇవ్వక పోతే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

నకిలీ విత్తనాల ను అమ్మే వ్యక్తులను గుర్తించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగిందని నకిలీ విత్తనాలు అమ్మే వ్యక్తులపై పీ.డి యాక్ట్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు, ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని 315 ఫర్టిలైజర్ షాప్ లో యజమానులకు డీలర్లకు నకిలీ విత్తనాలు అమ్మకూడదని నకిలీ విత్తనాలు విక్రయిస్తే పిడి యాక్ట్ ద్వారా చర్యలు తీసుకుంటామని సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ క్యాపిటల్ గా పిలుస్తారని మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు విత్తనాలు తరలిపోకుండా, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి విత్తనాలు రాకుండా మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి నిశితంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. 

వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా జిల్లాలోని 45 క్లస్టర్లలో రైతు వేదికలలో విత్తనాలు కొనుగోళ్లు, అధిక దిగుబడులపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి మంగళవారం పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు వేదికలలో రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన, నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తే కలిగి నష్టాలపై వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అవగాహన కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ద్వారా 8.8 టన్నులు ఎలాంటి అనుమతులు లేని వరి విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రైతులు విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మేలైన విత్తనాలను కొనుగోలు చేసి అధిక దిగుబడి సాధించాలని ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే స పోలీసులకు, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని శివ సాయి బాబా ఫెర్టీ లైజర్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఫెర్టీలైజర్ దుకాణంలో కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన రిజిస్టర్ ను, విత్తనాల ప్యాకెట్లను, నిల్వ స్టాకు ను పరిశీలించారు. స్టాకు వివరాలు పెట్టాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మకూడదని మార్కెట్ లో అధిక డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ చేసి అధిక ధరకు విక్రయించొద్దని సూచించారు. నాణ్యమైన విత్తనాలను అమ్మాలని, గత సంవత్సరం గడువు తీరిన, అలాగే సీల్ లేనివి, ప్రభుత్వ అనుమతులు లేని విత్తనాలను అమ్మకూడదని అని ఫెర్టీలైజర్ దుకాణ యజమానులకు సూచించారు. కొనుగోలు చేసిన విత్తనాలకు రైతులకు తప్పని సరిగా రశీదు ఇవ్వాలని, కొనుగోలు, అమ్మకాలపై స్టాకు రిజిస్టర్ నిర్వహించాలని తెలిపారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాల రశీదును భద్రపరచాలని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, ఉద్యాన అధికారి సంజీవ రావు, ఏ.ఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles