ప్రొఫెసర్ జయశంకర్ సేవలు సార్ చిరస్మణీయం: జిల్లా ఎస్పీ
భూపాలపల్లి, ఆగష్టు 6(అక్షర సవాల్):
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన తెలంగాణ సాధన కోసం చేసిన సేవలు చిరస్మరణియమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ అన్నారు.
ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా, తొలి తరం ఉద్యమకారుడిగా, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని, ఆయనను తెలంగాణ రాష్ట్రం ఎప్పటికి మరవదనిఅన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ 1969 తొలి తరం తెలంగాణ ఉద్యమంలో, నాన్ ముల్కీ ఉద్యమంలో, ఇడ్లీ – సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు.
తెలంగాణ ప్రజల యాస, బాషా, సంస్కృతులు, జీవన విధానం పై పూర్తి అవగాహన ఉన్న జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఐతే దృఢ సంకల్పం తో ముందుకు తీసుకెళ్లగలరని భావించి, బాధ్యతలు అప్పగించి వారికి సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించారని అన్నారు.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై జయశంకర్ సార్ పుస్తకాలు వ్రాసి తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారని, జయశంకర్ సార్ తన ఆస్తిని, జీవితాన్ని, ఊపిరిని తెలంగాణ కోసం అంకితం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి అడ్మిన్, రామోజు రమేష్, వి. శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు రామ్ నర్సింహారెడ్డి, రాజేశ్వరరావు, వెంకట్, శ్రీకాంత్, రత్నం, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.