మూడు సంవత్సరాల క్రితం మహబూబాబాద్ పట్టణం లో సంచలనం రేపిన బాలుడి కిడ్నాప్ హత్య ఉదాంతం లో నిందితుడు మంద సాగర్ కు మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ మరణ శిక్ష విధించారు
మహబూబాబాద్ టీ న్యూస్ రిపోర్టర్ కుసుమ రంజిత్ రెడ్డి కుమారుడైనటువంటి కుసుమ దీక్షిత్ రెడ్డిని అతి కిరాతకంగా తాళ్లపూస పెళ్లి శివారు దానమయ్య గుట్టలో హత్య చేసిన నిందితుడు మంద సాగర్ కు మరణశిక్ష పడింది
.ఈ తీర్పుతో దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు న్యాయ దేవత, పోలిస్ చిత్ర పటాలకు పాలాభిషేకం
చేసి దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు బాణసంచా కాల్చి సంబరాలు.జరుపుకున్నారు