ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్.
- హద్దులు దాటితే తిప్పలు తప్పవు
- ఇబ్బందులకు గురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
- సరదాలకు పోయి కష్టాలు కొని తెచ్చుకోవద్దు
- జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై అవగాహన సదస్సు
భూపాలపల్లి, సెప్టెంబర్ 29(అక్షర సవాల్):
విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్పి పుల్లా కరుణాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ర్యాగింగ్ నేరమని, ఎవరైనా ర్యాగింగ్ పాల్పడితే శిక్షా అర్హులు అవుతారని హెచ్చరించారు. విద్యార్థులు స్నేహపూర్వకంగా కలిసిమెలిసి విద్యానభ్యసించాలని ఎస్పి కోరారు. ర్యాగింగ్ కు పాల్పడితే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యసనాలకు బానిసై విద్యార్థులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పి కరుణాకర్ అన్నారు. విద్యార్థులు మొదట తాము చదువుకోవడానికి వస్తున్నామని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సరదాలకు వెళ్లి కష్టాలను కొని తెచ్చుకోవద్దని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఎదగాలని సూచించారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తూ దోషులుగా నిలబడవద్దని ఎస్పి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజు దేవ్ డే, వైస్ ప్రిన్సిపల్ రఘు, చిట్యాల సీఐ వేణు చందర్, ఘనపురం ఎస్సై సాంబమూర్తి, డాక్టర్లు రాజేష్ ,ఆంజనేయ బాబు, ప్రత్యూష మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.