Trending Now
Thursday, January 2, 2025

Buy now

Trending Now

త్యాగానికి ప్రతీక బక్రీద్.. జీఎస్సార్

       త్యాగానికి ప్రతీక బక్రీద్

  • ఇస్లాంపై విశ్వాసంతో ప్రత్యేక ప్రార్థనలు
  •  ముస్లింలకు బక్రీద్  శుభాకాంక్షలు తెలిపిన గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి ,జూన్ 29(అక్షర సవాల్):
దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ పండుగను నిర్వహించుకుంటారని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు  అన్నారు.

గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురి ముస్లిం సోదరుల ఇళ్ళల్లోకి వెళ్లి జీఎస్సార్ పండుగ శుభాకాంక్షలు తెలుపగా, వారు జీఎస్సార్ కు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. త్యాగనిరతికి నిదర్శంగా నిలిచే ఈ బక్రీదును ధనిక పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారని తెలిపారు. పేద ప్రజలపై కరుణ, దాతృత్వానికి నిదర్శనంగా బక్రీద్ నిలుస్తుందన్నారు. అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని జీఎస్సార్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో వారి వెంట టిపిసిసి సభ్యులు చల్లూరి మధు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, కోశాధికారి వెంకీ యాదవ్, సీనియర్ నాయకులు బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్, ఎన్ఎస్ యూఐ పట్టణ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రూరల్ యూత్ ప్రెసిడెంట్ తోట రంజిత్, ఉడుత మహేందర్, నగునూరి రజినీకాంత్, ఉప్పుగల్ల కిషోర్ రెడ్డి, రాజిరెడ్డి ముస్లిం సోదరులు ఫాజిల్, హాఫిజ్, హైమద్, అఫ్రోజ్, ఉస్మాన్, తదితరులు ఉన్నారు.

Related Articles

Latest Articles