ప్రజా గర్జనకు కెసిఆర్ భయపడుతున్నాడు..రేణుక చౌదరి
ఖమ్మం , జులై 02( అక్షర సవాల్ ):
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభ కు తన ఇంటి నుంచి బయలుదేరారు. అయితే ఖమ్మం నగరంలోని కరుణగిరి వద్ద రేణుక చౌదరి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె బారికేడ్లను నెట్టుకుని నేరుగా ఖమ్మం సభా ప్రాంగణానికి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా రేణుక చౌదరి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు బారికేడ్లు పెడితే నేను అగుతానా? అని అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పేది ఒకటి.. చేసేది ఇంకొకటని విమర్శించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నిజ స్వరూపం బయటపడిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వస్తుండడంతో కేసీఆర్ భయపడుతున్నారన్నారు. తాను కాంగ్రెస్ కార్యకర్తనని.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని రేణుక చౌదరి స్పష్టం చేశారు.