ప్రధాని పర్యటన వేళ ట్రాఫిక్ మళ్ళింపు
వరంగల్,జూలై 6 (అక్షర సవాల్):
ఈ నెల 8వ తారీకున భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన సందర్భంగా వరంగల్ మరియు హనుమకొండ నగరాల్లో ట్రాఫిక్ మళ్ళింపుతో పాటు ట్రాఫిక్ అంక్షలు అమలు చేయబడుతాయి అని. కావున హైదరాబాద్, ఖమ్మం, హుజురాబాద్, ములుగు మరియు అపై ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు క్రింది తెలిపిన విధంగా ఆయా ఆయా మార్గాల్లో ప్రయాణించాల్సి వుంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వాహనదారులు సూచించారు.
హుజురాబాద్ వైపు నుండి హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాలకు వెళ్ళే వాహనాలు చింతగట్టు ఓ.ఆర్.ఆర్, కరుణాపురం మీదుగా హైదరాబాద్ కు వెళ్లవలసివుంటుంది. మరియు కరుణాపురం ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మంకు పోవాల్సి వుంటుంది.
పర్కాల, ములుగు మార్గాల నుండి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్ళే వాహనాలు ఓ.ఆర్.ఆర్, కరుణాపురం మీదుగా హైదరాబాద్ కు వెళ్లవలసివుంటుంది. మరియు కరుణాపురం ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మంకు పోవాల్సి వుంటుంది.
నర్సంపేట్ అపై ప్రాంతాల నుండి హైదరాబాద్, కరీంనగర్ పైవు వెళ్ళే వాహనాలు వెంకట్రామ జంక్షన్, పోచమ్మమైదాన్, జంక్షన్, దేశాయిపేట్ 80ఫీట్ రోడ్, ఆటోనగర్, హనుమన్ జంక్షన్, పెద్దగడ్డ, కేయూ జంక్షన్, చింతగట్టు ఓ.ఆర్.ఆర్ మీదుగా పోవాల్సి వుంటుంది.
వర్ధన్నపేట అపై మార్గాల నుండి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, పర్కాల, భూపాలపల్లి వెళ్ళే వాహనాలు పున్నేలు క్రాస్ నుండి డైవర్షన్ తీసుకోని ఐనవోలు, కరుణాపురం ఓ.ఆర్.ఆర్ మీదుగా పోవాల్సి వుంటుంది.
అలాగే హైదరాబాద్, ఖమ్మం మరియు అపై మార్గాల నుండి వచ్చే వాహనాలు పైన సూచించిన మార్గాల మీదుగా వారి, వారి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వుంటుంది.
ముఖ్యంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో జరిగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు వచ్చే వాహనాలు క్రింద తెలిపిన మార్గాల మీదుగా రావల్సి వుంటుంది.
హుజురాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలు కేయూసి జంక్షన్, 100 ఫీట్ల రోడ్ మీదుగా సెయింట్ పీటర్ ఫార్మసీ కాలేజ్, అబేంద్కర్ భవన్, గోకుల్ జంక్షన్ మీదుగా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలను దించి ఖాళీ వాహనాలను ఇదే మార్గంలో తిరిగి వెళ్ళి కేయూసి ఎస్.డి.ఎల్.సి.ఈ మైదానంలో తమ వాహనాలను పార్కింగ్ చెయ్యాల్సి వుంటుంది.
పర్కాల, భూపాల్ పల్లి ములుగు నుండి వచ్చే వాహనాలు పెద్దమ్మగడ్డ డైవర్షన్ నుండి కేయూసి జంక్షన్, 100 ఫీట్ల రోడ్ మీదుగా సెయింట్ పీటర్ ఫార్మసీ కాలేజ్, అబేంద్కర్ భవన్, గోకుల్ జంక్షన్ మీదుగా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలను దించి ఖాళీ వాహనాలను ఇదే మార్గంలో తిరిగి వెళ్ళి కేయూసి ఎస్.డి.ఎల్.సి.ఈ మైదానంలో తమ వాహనాలను పార్కింగ్ చేయాల్సి వుంటుంది.
నర్సంపేట వైపు నుండి వచ్చే వాహనాలు వెంకట్రామ జంక్షన్, పోచమ్మమైదాన్, జంక్షన్, దేశాయిపేట్ 80 ఫీట్ రోడ్, ఆటోనగర్, హనుమన్జంక్షన్, పెద్దమ్మగడ్డ, కేయూ జంక్షన్,100 ఫీట్ల రోడ్ మీదుగా సెయింట్ పీటర్ ఫార్మసీ కాలేజ్, అబేంద్కర్ భవన్, గోకుల్ జంక్షన్ మీదుగా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలను దించి ఖాళీ వాహనాలను ఇదే మార్గంలో తిరిగి వెళ్ళి కేయూసి ఎస్.డి.ఎల్.సి మైదానంలో తమ వాహనాలను పార్కింగ్ చేయాల్సి వుంటుంది.
పై మూడు మార్గాల నుండి వచ్చే వాహనాలు ఉదయం 9.30 గంటల లోపు సుబేదారి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవాల్సి వుంటుంది. తరువాత వచ్చే వాహనాలు కేయూసి జంక్షన్ వరకు మాత్రమే అనుమతించబడుతుంది.
వర్ధన్నపేట నుండి వచ్చే వాహనాలు పున్నేలు క్రాస్, ఐనవోలు,కరుణాపురం మడికొండ, కాజీపేట మీదుగా ఫాతీమ జంక్షన్ వద్ద ప్రజలను దించి ఖాళీ వాహనాలను సెయింట్ గ్రాబియల్ స్కూల్ మైదానంలో తమ వాహనాలను పార్కింగ్ చేయాల్సి వుంటుంది.
ఘనుపూర్ ఆపై మార్గాల నుండి వచ్చే వాహనాలు కరుణాపురం మడికొండ, కాజీపేట మీదుగా ఫాతీమ జంక్షన్ వద్ద ప్రజలను దించి ఖాళీ వాహనాలను సెయింట్ గ్రాబియల్ స్కూల్ మైదానంలో తమ వాహనాలను పార్కింగ్ చేయాల్సి వుంటుంది.
ఈ ట్రాఫిక్ మళ్ళీ ఇప్పు మరియు ఆంక్షలు ఉదయం 4:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించబడతాయి.
ఈ నెల 8వ తారీకున ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా వరంగల్ ట్రై సిటి పరిధిలో ట్రాఫిక్ రద్దీ కారణంగా మళ్ళింపు మరియు అంక్షలు వున్నందున వాహనదారులు అవసరం వుంటే తప్ప తమ వాహనాలను రోడ్పైకి తీసుకరావద్దని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.