అక్షర సవాల్ – అందరి టీవీ ,నర్సంపేట ప్రతినిధి
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ఉన్న బొందబడి జిల్లా పరిషత్ మోడల్ పాఠశాలలో స్లాబ్ పెచ్చులూడి పడి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు
. స్లాబ్ పెచ్చులూడటంతో 7వ తరగతి చదువుతున్న మహిదర్,
అజయ్ లు గాయపడ్డారు. గమనించిన ఉపాధ్యాయులు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో ఒకరికి తీవ్రగాయం ఐనట్లు సమాచారం
వీరిద్దరూ నర్సంపేట పట్టణము లోని సర్వపురంప్రాంతానికి చెందినవారు కాగా
ఆసపత్రికి చేరుకున్న విద్యార్థులు తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు