Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

నాలుగో శనివారం నో బ్యాగ్‌డే

హైదరాబాద్ డెస్క్: (అక్షర సవాల్):ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి నెలలో నాలుగో శనివారం నో బ్యాగ్‌డేగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ2020 ప్రకారం ఏడాదిలో 10 రోజులు బ్యా గ్‌ లేకుండా విద్యార్థులు బడికొచ్చేలా చూడాలని సూచించింది. విద్యార్థులపై ఒత్తిడి రాకుండా, బడి సంచి భారాన్ని తగ్గించడంలో భాగంగా దీనిని అమలు చేయనున్నారు. అయితే ఈ నాలుగో శనివారం ఏం చేయాలో.. ఏ కార్యకలాపాలు చేపట్టాలో సూచిస్తూ ఎస్సీఈఆర్టీ ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించింది.

1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరి కోసం ఈ పుస్తకాన్ని రూపొందించారు. 28 రకాలైన కార్యకలాపాలుండగా, వీటిలో వీలును బట్టి వినియోగించుకొనే అవకాశం కల్పించారు. మ్యూజియం, చారిత్రక ప్రదేశాలు, గ్రామ పంచాయతీలు వంటి కార్యాలయాల సందర్శన, సైన్స్‌ ప్రయోగాలు, బాలికావిద్యపై స్కిట్‌, పతంగుల తయారీ, అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, గణిత కార్నర్‌, గణిత రంగోలి, మాడల్‌ ఎన్నికలు, మాక్‌ అసెంబ్లీ, ఆర్థిక లావాదేవీల నిర్వహణ, బేస్డ్‌ లెర్నింగ్‌ ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల బడుల్లో తప్పనిసరికానున్నది.

Related Articles

Latest Articles