ఎన్నికలప్పుడు మాత్రమే అభివృద్ధి గుర్తుకువచ్చిందా… ?
-ఎన్నికలకు కొద్ది రోజుల ముందు శంఖు స్తాపనలా
– వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్
గణపురం, సెప్టెంబర్ 23(అక్షర సవాల్)
ప్రజలను మభ్య పెడుతున్న ఎమ్మెల్యే మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వస్తుంది అనగా ప్రజలను మభ్య పెట్టేందుకే భూపాలపల్లి ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు శంకుస్థాపనలపర్వంతో ప్రజలను మభ్యపెట్టేందుకై శంకుస్థాపనలు ఏయటం జరుగుతున్నదని గణపురం కాంగ్రెస్ మండల నాయకులు ఆరోపించారు. శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గణపురం మండలంలో గణపురం, బస్సురాజుపల్లి, బుద్ధారం తదితర గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల పేరిట శంకుస్థాపనలు చేశారు. గణపురం మండల కేంద్రంలో గల హెల్త్ సబ్ సెంటర్ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని శనివారం కాంగ్రెస్ నాయకుల బృందం పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత 15 సంవత్సరాలుగా పిల్లర్ల దశలోనే నిలిచిపోయిన మండల సమైక్య భవనాన్ని ఆనుకొని హెల్త్ సబ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం హాస్యాస్పదంగా ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గతంలో 2009లో ఎమ్మెల్యేగా ప్రభుత్వ చీఫ్ గా పనిచేసినప్పుడు మండల సమాఖ్య భవనాన్ని శంకుస్థాపన చేయడం ఆ భవనం పిల్లర్ల దశలోనే ఉందన్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు అలాగే ఉండడం అటువంటి భవనాన్ని పూర్తి చేయకుండా ఆ ప్రక్కనే హెల్త్ సబ్ సెంటరు ఏర్పాటు చేస్తామని శంకుస్థాపన చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అదేవిధంగా అభివృద్ధి పేరుతో గణపురం మండలంలోని బుద్ధారం గ్రామానికి ఏమి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పాలని వారు అన్నారు. ఒక్కరోజైనా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా బుద్ధారం గ్రామంలో చేపట్టలేదని ఆకస్మికంగా హుటాహుటిన వచ్చి బుద్ధారం గ్రామానికి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ లకు సమాచారం లేకుండా పోలీసు పహార నడుమ హెల్త్ సబ్ సెంటర్ శంకుస్థాపన చేసి వెళ్లిపోవడం అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. చిత్తశుద్ధి ఉంటే గణపురం మండలానికి చేసిన అభివృద్ధి ఏమిటో భూపాలపల్లి ఎమ్మెల్యే చెప్పాలని లేనట్లయితే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైస్ ఎంపిపి విడిదినేని అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేపాక రాజేందర్, బుద్ధారం సర్పంచ్ గండ్ర ఆగమరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణ, దూడపాక పున్నం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.