డబ్బులు ఎవరికి ఊరికే రావు – సీఐ రమణమూర్తి
– సైబర్ నేరాల పై అవగాహన
– పలు జాగ్రత్తలపై ప్రధాన కూడలిలో సమావేశం
– డయాల్ 1930, డయాల్ 100 పై అవగాహన
– మత్తు,మాదక ద్రవ్యాల పై సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
– స్మార్ట్ ఫోన్ల పట్ల జాగ్రత్తలు వివరణ
నర్సంపేట,జూలై 16,(అక్షర సవాల్): డబ్బులు ఎవరికీ ఊరికే రావని ఎవరు సైబర్ మోసాల బారిలో పడొద్దు అని సిఐ రమణమూర్తి అవగాహన సమావేశాన్ని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లు వినియోగం పెరగడంతో పాటు అంతే వేగంగా మోసాలు సైతం పెరుగుతున్నాయని వాటిని జాగ్రత్తలు పాటించి అరికట్టవచ్చని ఆయన అన్నారు.ఏదైనా తెలియని నంబర్ నుండి ఫోన్ చేసినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని,పూర్తి వివరాలు చెప్పినంత మాత్రాన తెలిసిన వారు కాదని,ఎవరికి వ్యక్తిగత పాస్వర్డ్ లు, ఓటీపీ లు వెల్లడించకూడదని అన్నారు.ఆన్లైన్ ద్వారా డబ్బులు కోల్పోతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని,వెంటనే స్పందించి డబ్బులు తిరిగి పొందేందుకు కావలసిన చర్యలు చేపడుతారని అన్నారు.
రోడ్డు పై వాహనాలు నడిపే సమయంలో,ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు.డ్రైవర్ సీట్ పక్కన ఎవరిని కూర్చో బెట్టుకోకూడదని ఆటో డ్రైవర్లకు సూచించారు.పరిమితికి మించి ప్రయాణికులకు తరలించి ప్రమాదాలు కొనితెచ్చుకోకూడదని,ప్రమాదాలు జరిగిన సమయంలో పరిమితికి మించి ప్రయాణిస్తే ఇన్స్యూరెన్స్ వర్తించదని అన్నారు.ఆటోలలో అధిక శబ్దం వచ్చే స్పీకర్లు ఉండకూడదని ఉంటే తీసివేయాలని అన్నారు.ఈ మధ్య కాలంలో యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని అంటూ,ఎవరైనా డ్రగ్స్,మత్తు మాదక ద్రవ్యాలు సేవిస్తూ కనపడితే సమాచారం అందించాలని కోరారు.అంతే కాకుండా తరలిస్తూ ఉంటే సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని రీహాబిటేషన్ సెంటర్ కి తరలించి మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, పాదచారులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.